సాగునీటిపై రైతులకు అవగాహన కలిగించాలి
దర్పల్లి, సిరికొండ మండలాల్లో వరి పంటను పరిశీలించిన కలెక్టర్ నిజామాబాద్, బతుకమ్మ : దర్పల్లి, సిరికొండ మండలాల్లోని ఆయా ప్రాంతాలలో ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. బోరుబావుల కింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. దర్పల్లి మండలం చెరువుతండా శివారులో ఒడ్డేటి చిన్నసాయిలు, సిరికొండ మండలం పెద్దవాల్గోట్ శివారులో శోభన్ రాజు...