రైతులకు నష్టపరిహారం చెల్లించాలి : టీజీవీపీ
బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలంలోని ఖండ్‌గాం గ్రామం వరద ముప్పులో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం చుట్టూ నీరు చేరడంతో రవాణా పూర్తిగా ఆగిపోయింది. బయటకు వెళ్లే అన్ని రహదారులు నీటితో మునిగిపోవడంతో ప్రజలు ఒక రకంగా బంధీ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) బోధన్ డివిజన్ అధ్యక్షులు మిసాలే నాగేష్ మాట్లాడుతూ – “ఖండ్‌గాం గ్రామం చుట్టూ నీరు చేరి గ్రామస్తులు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు...