Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 7:52 pm Posted by : ramakrishna

రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి

 

. . . సబ్ స్టేషన్ పనులను ప్రారంభించాలి

 

. . . బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్ చార్జి బాజిరెడ్డి జగన్

 

సిరికొండ, బతుకమ్మ :

 

ఇటీవల కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ రూరల్ ఇన్ చార్జి బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామంలో పంట నష్టపోయిన రైతులను ఆయన బుధవారం పరామర్శించారు. సుమారు 700 ఎకారాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం నివేదికను ఉన్నతాధికారులకు పంపించారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాటిపల్లి గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరై శంకుస్థాపన చేసి సంవత్సరం గడిచినా పనులు ప్రారంభం కాలేదని, ఎవరు అడ్డుకుంటున్నారో తెలుపాలన్నారు. గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులు కలిసి స్థలాన్ని ఎంపిక చేశారని, ఇప్పుడు స్థలం మార్చమని చెప్పడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గ్రామస్తులందరూ కలిసి డబ్బులు పోగు చేసి రోడ్డు ఏర్పాటు చేశారన్నారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి సబ్ స్టేషన్ పనులను ప్రారంభించాలని, లేని పక్షంలో సిరికొండ మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నార వోయిన శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ తోట రాజన్న, ఉప సర్పంచ్ దేవేందర్, మాజీ సర్పంచ్ తిరుపతి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి, నాయకులు సంజయ్, గోపాల్ నాయక్, భూషణ్ రెడ్డి, సతీశ్ రెడ్డి, చలపతి, సాగర్, గంగాధర్, ప్రకాశ్, రమేశ్, మోహన్, రాంచందర్, లాల్సింగ్, శంకర్, రాజేశ్, రైతులు పాల్గొన్నారు.