Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 5:44 pm Posted by : ramakrishna

రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి

  • ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వ్యాప్తంగా రైతాంగం రభి లో వేసుకున్న వరి పొలాలు, ఇతర పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్నాయని ఎండుతున్న పొలాలకు ఎకరానికి రూ.30ల నష్ట పరిహారం చెల్లించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. అఖిలభారత రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం  మోపాల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ కు మెమోరాడం అందజేశారు. ఈ సందర్భంగా  ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ పుట్టెడు కష్టాలతో అప్పులు సైతం చేసి రైతులు వేసుకున్న వరి పొలాలు మొక్కజొన్న పంటకు నీళ్లందక ముందే పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదం చెందుతున్నారని అన్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోరులో నీళ్లు లేక పంటలకు వీళ్ళందక ఎండిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వ అధికారులు రభి సీజన్లో వరిపై కాకుండా అరితడి పంటల వైపు రైతులను మళ్ళించడంలో విఫలమైందన్నారు. ప్రతి పంటల సీజన్ గాను పంట ప్రణాళిక ప్రకారం రైతులకు చైతన్య పరచాలి కానీ పరచలేదన్నారు. ఎండుతున్న పంటలకు ఇప్పుడైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జరపాలని పంట నష్టపోయిన రైతులకు ఎకరంకు 30 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రైతుల అప్పులను మాఫీ చేసి రాబోయే ఖరీఫ్ సీజన్ పంటలకు రైతులను ఆదుకోవడానికి  ఉచితంగా విత్తనాలు ఎరువులు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, ఏ. చిన్నయ్య,పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బండమీ నరసయ్య,జి.గంగాధర్, ప్రకాష్, అబ్బయ్య, ఎల్లయ్య, మహేష్, గణేష్, వినోద్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Farmers should be compensated