. . . మండుటెండలో ఆందోళన చేసిన రైతులు
లింగంపేట్ బతుకమ్మ :
భవానిపేట్, ముంబాజిపేట్, కంచుమహల్, కొండాపూర్ జల్లిపల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతుందని ని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులపాటు కేవలం రెండు లారీలు మాత్రమే రవాణా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని, అధికారులు తీరికు నిరసనగా శనివారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో రహదారి పై రాస్తారోకో నిర్వహించారు.

ధాన్యంతో వెళ్లిన లారీలు రైస్ మిల్లులో సకాలంలో దించుకొని కారణంగా రవాణా తీవ్ర జాప్యం ఏర్పడుతుందన్నారు. రానున్న ఖరీఫ్ కు సంబంధించి వర్షాలు ముందస్తుగానే వాతావరణ శాఖ అధికారులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ధాన్యం రవాణా మాత్రం ముందుకు సాగడం లేదు. భవానిపేట గ్రామంలో సుమారు 200కు పైగా వరి ధాన్యం కుప్పలు తూకం వేయాల్సి ఉందని అని రైతులు వెల్లడించారు. అధికారులు స్పందించి ధాన్యం రవాణా వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి రహదారిపై కొట్టాల వద్ద రైతులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రైతుల వద్ద చేరుకొని సముదాయించారు. ఆందోళన చేయడం సమస్యలు పరిష్కారం కావని ఎస్ఐ దీపక్ కుమార్ రైతులకు సూచించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
