రహదారిపై రైతుల ధర్నా
సముదాయించిన ఎమ్మెల్యే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం... రైతుల ఆందోళన... బతుకమ్మ బాన్సువాడ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై అన్నదాతలు ఆగమవుతున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనేవారు లేక నిరసనలకు దిగుతున్నారు. బుధవారం పోతంగల్ మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక చెక్ పోస్ట్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కాంటలు పూర్తయిన ధాన్యం సంచులను వెంటనే మిల్లులకు తరలించాలని, లోకల్ రైస్ మిల్లులకే అలాట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో...