Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 8:22 pm Posted by : ramakrishna

రైతు వేదిక ముందు రైతుల ధర్నా

 

. . . వెంటనే నష్ట పరిహారం చెల్లించాలి

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

గత నెల 24 వ తేదీన వడగండ్ల తో కూడిన భారీ వర్షం కురవడంతో 13 ఎకరాల వరి ధాన్యం సర్వనాశనం అయిందని, పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతులు రైతు వేదిక ముందు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పపోల్ల రామస్వామి మాట్లాడుతూ భారీ వడగండ్ల వాన కురవడంతో నా భూమి, నేను కౌలుకు చేసే భూమి మొత్తం 13 ఎకరాల వరి పంట మొత్తం నేలపాలు అయిందని తెలిపారు. వరి పంట నేలపాలు అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ తో పాటు అధికారులు వచ్చారని, దాదాపు నెలరోజులు అవుతున్న వరి పంట నష్టం డబ్బులు ఇంతవరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 13 ఎకరాలకు పెట్టుబడి కొరకు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, ఎకరానికి 40 వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి నన్ను మా కుటుంబాన్ని ఆదుకోవాలని, లేకపోతే మాకు ఆత్మహత్యే శరణ్యమని అన్నారు. ఈ విషయం పైన వ్యవసాయ విస్తరణ అధికారినీ లత మాట్లాడుతూ వడ గండ్ల వాన కురవడంతో 6 వందల ఎకరాల రైతులకు పంట నష్టం జరిగిందని, ముఖ్యంగా పాపోల్ల రామస్వామి, మౌనిక, వెంకటలక్ష్మి వారికి 13 ఎకరాల పంట నష్టం జరిగిందని, ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. నష్ట పరిహారం రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పపోల్ల మౌనిక, వెంకట్ లక్ష్మీ, మణెమ్మ, భారతమ్మ, శ్యామల, స్వామి, సత్యవ్వ, మల్లవ్వ, స్రవంతి, బాల పోచవ్వ, బాబు, చంద్రం, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

 

Farmers' protest in front of the farmers' platform