Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 8:17 pm Posted by : ramakrishna

వరి ధాన్యం అమ్ముకోవడానికి రైతుల అరిగోస

  • ఉమ్మడి జిల్లాల్లో అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం
  • రహదారుల వెంట, కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే
  • పట్టించుకోని ప్రభుత్వం.. చోద్యం చూస్తున్న అధికారులు
  • రైతుల కష్టాలు కంటే సీఎంకు అందాల పోటీలు ఎక్కువయ్యాయి
  • అకాల వర్షాలకు నష్టపోయిన ఇతర పంటల రైతులను ఆదుకోవాలి
  • మాజీ మంత్రి, బాల్కొండ  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

హైదరబాద్, బతుకమ్మ : రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం చెబుతున్న గొప్పలన్ని ఉట్టిమాటలేనని అని రైతులు కష్టపడి పండించిన పంటను కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లో అమ్ముకోవడాని హరిగోస  పడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ఇంకా కల్లాల వద్ద ,రహదారులపై దాన్యరాసులు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయన్నారు.ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షాలకు తడిసిపోతున్నాయని ఆరోపించారు. ఆరుంగాలం కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం కొనకపోయేసరికి అకాల వర్షాలకు తడిసి మొలకలు వచ్చి రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఎమ్మెల్యే  విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య  వైఖరి తోనే ధాన్యం నీటి పాలు అవుతున్నదని ,తడిచిన, మొలకలు వచ్చిన ధాన్యం తీసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నరన్నారు. రైతులు గతంలో కేసీఆర్ తడిచిన ధాన్యాన్ని కొన్న సంగతి గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. కల్లాల వద్ద కొన్న ధాన్యం కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సకాలంలో లారీలు ప్రభుత్వం పంపకపోవడంతో ధాన్యం నీటి పాలు అవుతున్నదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రైతులు పడుతున్న కష్టాల కంటే అందాల పోటీలు ముఖ్యమయ్యాయి అని ఎద్దేవా చేశారు. ధాన్యం సేకరణపై అధికారులతో రివ్యూ చేయడానికి సమయం లేని ముఖ్యమంత్రి అందాల పోటీల విషయంలో ఎనిమిది సార్లు సమీక్ష నిర్వహించారు అని విమర్శించారు. రైస్ మిల్లులకు చేరిన ధాన్యం నుండి ఎక్కువ మొత్తంలో తరుగు తీస్తూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారు అని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఎమ్మెల్యే  డిమాండ్ చేశారు. తడిచిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వము తక్షణమే కొనుగోలు చేయాలని,కొన్న ధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్ తక్షణమే అందజేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోతున్న సజ్జలు ఇతర పంటల రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.