Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 12:26 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో రైతు పిటిషన్

హైదరాబాద్, బతుకమ్మ : 

 

రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓ రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదని పిటిషన్ దాఖలు చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా వేసింది.