సోయా పంట కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కోప్పిశెట్టి కి వినతి మద్నూర్, బతుకమ్మ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  సోయా పంటకు మద్దతు ధర రూ.4,892 ప్రకటిస్తూ మద్నూర్ మార్కెట్ యార్డులో మద్నూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ వరకు పంట కొనుగోలు జరిపి పూర్తిగా నిలిపివేశారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతుల పంట దాదాపు 5వేల నుండి పదివేల క్వింటాళ్ల వరకు అలాగే ఉండిపోవడంతో గురువారం మార్కెట్ యార్డులో రైతులు రోడ్డెక్కి రాస్తారోకో ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని మద్నూర్ తాసిల్దార్...