కదం తొక్కిన కామారెడ్డి జిల్లా రైతులు
. గాంధారి ప్రధాన రహదారిపై రాస్తారోకో . షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ . సంఘీభావం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కామారెడ్డి, బతుకమ్మ: షరతులు లేకుండా రైతులందరికీ రూ.2లక్షల రుణం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు సోమవారం గాంధారి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ప్రధాన రహదారిపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాస్ పుస్తకాలే ప్రామాణికంగా...