. గాంధారి ప్రధాన రహదారిపై రాస్తారోకో
. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్
. సంఘీభావం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
కామారెడ్డి, బతుకమ్మ: షరతులు లేకుండా రైతులందరికీ రూ.2లక్షల రుణం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు సోమవారం గాంధారి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ప్రధాన రహదారిపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాస్ పుస్తకాలే ప్రామాణికంగా రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేయాలని, రైతు భరోసా కింద రూ.15వేలు విడుదల చేయాలని, పాడి రైతులకు పెండింగ్ లో ఉన్న పాల బిల్లు విడుదల చేయాలి, అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్ ధర్నాలో పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. రైతులు ట్రాక్టర్లు, ప్రైవేట్ వాహనాల్లో భారీ సంఖ్యలో తరలిరావడోం ప్రధాన రహదారి స్తంభించింది. ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిమాండ్లతో నేన వేర్చే వరకు తమ ఉద్యమం ఆగదంటూ రైతు ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు.