Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 8:35 pm Posted by : ramakrishna

రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

 

. . . ఇందల్ వాయి తాండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వసంత్ రావు

 

ఇందల్ వాయి, బతుకమ్మ

 

ఇప్పటివరకు పట్టా పాస్ బుక్ ఉండి ఆధార్ ఫోన్ నెంబర్ లింకు లేని వారు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇందల్ వాయి తాండ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వసంత్ రావు తెలిపారు. రైతు వేదికలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ సంబంధిత లింకు ఉన్న ఫోను తీసుకొని వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయనన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నిర్ణిత సమయంలో వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్టర్ లో నమోదు చేసుకోలేని వారు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్నిటికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రామాణికం అన్నారు. ఉదయం 10 గంటలకు వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓ ప్రకాష్ గౌడ్, రైతు వేదికకి కు సంబంధిత పత్రాలు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రద్దు నాయక్ వసంత్ రావు తదితరులు పాల్గొన్నారు.