Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 August 2024, 5:04 pm Posted by : ramakrishna

రైతులకు ఎన్నో లాభాలు కలుగుతాయి

  • బతుకమ్మ ఎఫెక్ట్

బతుకమ్మ, మోర్తాడ్ : ’ఫాం పాంట్స్, ఫిష్ పాండ్ పై అవగాహన కరువు‘ అనే శీర్షికతో శనివారం వచ్చిన కథనానికి ఉపాధిహామీ అధికారులు స్పందించారు. మోర్తాడ్ మండలంలోని దో న్ పల్ గ్రామాల్లో ఉపాధిహామీ ఏపీవో శకుంతల రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఫాం ఫాంట్స్, ఫిష్ పాండ్ పై రైతులకు అవగాహన కల్పించారు. ఫాం ఫాంట్స్ నిర్మించుకోవడం వలన పంట భూముల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని, వర్షం నీరు వృధా కాకుండా నిలుపుదల చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఫిష్ పాండ్ నిర్మించుకోవడం వల్ల ఆర్థికంగా నిలదో క్కుకోవచ్చు అనేక లాభాలు కలుగుతాయని రైతులకు అవగాహన కల్పించారు. ఫాం పాంట్స్, ఫిష్ పాండ్ నిర్మించుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు స్థానిక గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు.