రైతు మహోత్సవ కిసాన్ మేళాకు తరలిన ఏర్గట్ల రైతులు
బతుకమ్మ,ఏర్గట్ల: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో జరిగే రైతు మహోత్సవం ( కిసాన్ మేళ) కి ఏర్గట్ల రైతులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల ఏవో విష్ణువర్ధన్ మాట్లాడుతూ రైతు సోదరులు ఈ మంచి అవకాశం గా కిసాన్ మేళ కి వచ్చి,వ్యవసాయ స్టాళ్లు, అధునాతన సాంకేతిక పద్ధతులు, తెలుసుకోవడం, నూతన ఆవిష్కరణలు,స్టార్టప్ లు,యంత్ర పరికరాలు ఉపయోగాలు వంటి ఎన్నో అంశాలు తెలుసుకొని, పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్,...