బతుకమ్మ,ఏర్గట్ల: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో జరిగే రైతు మహోత్సవం ( కిసాన్ మేళ) కి ఏర్గట్ల రైతులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల ఏవో విష్ణువర్ధన్ మాట్లాడుతూ రైతు సోదరులు ఈ మంచి అవకాశం గా కిసాన్ మేళ కి వచ్చి,వ్యవసాయ స్టాళ్లు, అధునాతన సాంకేతిక పద్ధతులు, తెలుసుకోవడం, నూతన ఆవిష్కరణలు,స్టార్టప్ లు,యంత్ర పరికరాలు ఉపయోగాలు వంటి ఎన్నో అంశాలు తెలుసుకొని, పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి, ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి,మూస్కు మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సంజీవ్,ఏ ఓ వైశ్ణవ్,ఏ ఈ ఓ,లు సాయి సచిన్, మనీషా, లు పాల్గొన్నారు.