Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2024, 9:21 pm Posted by : ramakrishna

ఈనెల 30న రైతు పండగ 

బతుకమ్మ, మద్నూర్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ అభివృద్ధి ధ్యేయంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ రుణమాఫీ రైతు భరోసా పంటకు బోనస్ రైతు భీమా ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నలకు కాంగ్రెస్ పార్టీ హయాంలో సహకారాలు అందిస్తున్నారని ఈ నెల 30న రైతు పండగ జరుపుకోవడం జరుగుతుందని మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య తెలిపారు. మద్నూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం సాయంత్రం చైర్మన్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ వ్యవసాయ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం తీస్తూ ప్రత్యేక దృష్టి సాధించడం పట్ల దేశంలోనే వరి ధాన్యం పంట దిగుబడి లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ముందున్న దాని ఆమె తెలిపారు సన్న వరి ధాన్యం కు క్వింటాలుకు 500 బోనస్ ఇవ్వడం రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 18 వేల కోట్లు చెల్లించి రైతులకు రుణమాఫీ చేయగా మిగిలిన రైతులకు ఈనెల 30న రుణమాఫీ రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఈనెల 30న రైతు పండగ ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని రైతులకు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దర్సావార్ సాయిలు నాయకులు హనుమాన్ స్వామి, మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, వట్నాల రమేష్, హనుమంత్ యాదవ్, సంతోష్ మేస్త్రి, బాలు యాదవ్, రచ్చ కుశాల్, బాలు సండే, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Farmer's festival on 30th of this month