- బోనస్ డబ్బులు రికవరీ చేయాలి డిమాండ్
- పోచారం అండతోనే అక్రమాలు
కోటగిరి, బతుకమ్మ : కోటగిరి సహకారం సంఘం చైర్మన్, రైస్ మిల్లు యజమానులు కుమ్మక్కై ప్రభుత్వ ఖరీఫ్ సీజన్ లో సన్నాలకు ఇచ్చిన బోనస్ క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులను బోగస్ పేర్లు పెట్టి ఇరువై లక్షల రూపాయల అవకతవకలు పాల్పడిన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కార్యక్రమంలో సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సిపిఐ నాయకులు విఠల్ గౌడ్ మాట్లాడుతూ… ఖరీఫ్ సీజన్ లో అకాల వర్షాల కారణంగా 75% వడ్ల ను ప్రవేట్ వ్యక్తులు అమ్ముకోగా మిగిలిన 30% శాతం వడ్ల మాత్రమే ప్రభుత్వ కొనుగోలు చేసిందని కొనుగోలు చేసిన వడ్లకు క్వింటకు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ చెల్లించగా కోటగిరి గ్రామంలో పోచారం అనుచరులు గా చెలామణి అవుతున్న కొందరు వ్యక్తులు కొన్ని రైస్ మిల్లుల యజమానులు కుమ్మక్కై పోచారం శ్రీనివాస్ రెడ్డి అండదండలతోనే 20 లక్షల రూపాయలు అవినీతి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తి చేశారు. వెంటనే బోనస్ డబ్బులను రికవరీ చేయాలనీ డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఉద్యమం తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాకాల సాయిలు, పత్తి గంగారాం, గంగాధర్, సాయిలు,కర్నె నడ్పి గజేందర్,చిత్తరి గంగాధర్, ఏడ్డేడి గంగాధర్, పాకాల శివ,శివరాజ్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
