Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 6:43 pm Posted by : ramakrishna

యూరియా కోసం  రైతుల అగచాట్లు

. . . క్యూలైన్ కోసం చెప్పులు

భిక్కనూరు, బతుకమ్మ :

 యాసంగి సీజన్ ముగిసిన ఖరీఫ్ కాలం ప్రారంభంలోనే రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం సోసైటి ద్వారా పంపిణీ చేసే మసాలా బస్తాలు ఇవ్వడానికి యాప్ ను ప్రవేశపెట్టిన సమయంలో దీనిపై అవగాహన లేని రైతులు పిఎసిఎస్ లకు వెళ్లి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ప్రారంభం కాగా కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు పడ్డారు. బిక్కనూర్  మండలం కాచాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద యూరియా బస్తాల కొనుగోలు చేసేందుకు రైతులు బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. యూరియా బస్తాలు గోదాంకు వచ్చిన సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచి చెప్పులు క్యూ లైన్ లో ఉంచారు. క్యూలో ఉన్న వారందరికీ యూరియా బస్తాలు పంపిణీ చేస్తామని సొసైటీ సీఈవో మహేశ్వరి తెలిపారు.

Farmers' demands for urea