Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 5:35 pm Posted by : ramakrishna

రైతు డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

  • ప్రభుత్వమే మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
  • కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోతున్న రైతులు
  •  మద్దతు ధర, అదనంగా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి కష్టాలను తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా, నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చిందని,దాదాపు 60 శాతం పంట కోయడం జరిగిందన్నారు. ఆరుంగాలలు రైతులు కష్టపడి పండించినటువంటి ఈ మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.1800 లకు కూడా కొనడం లేదని, వారు సిండికేట్ అయ్యి రైతులకు నష్టం చేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ వ్యాపారులు రూ.2000 లకు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు రూ.1800 కూడా కొనడం లేదన్నారు. దీనివల్ల రైతుల ఎకరానికి రూ. 30 వేల వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేట్ వ్యాపారులు ధరను ఇంకా తగ్గించి  రూ.1600 లకు కొనే పరిస్థితి వస్తుందని,వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిలువ చేసుకునే పరిస్థితి లేదన్నారు. నిల్వ చేస్తే తడిచిపోయే ప్రమాదం ఉండటంతో  రైతులు పంటను దిక్కులేక దళారులకు తక్కువ ధరకే అమ్మే పరిస్థితి దాపూరించిదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టాలంటే  ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి మక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు  ఆలస్యం చేయడం వల్ల ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర పంటను కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు.  ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయడమే కాకుండా ప్రస్తుతం రూ.2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్న పంటను మెరుగైన మద్దతు ధర రూ.400 కలిపి రూ. 2800 కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీని  డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల ఈ ప్రభుత్వం కు రైతులు అంటే లెక్కలేని తనం మని, ఇవాళ మక్క పండించే రైతులు ఇబ్బంది ప్రభుత్వం కు కనబడడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం  గ్రామ గ్రామాన మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి పంట వెంటనే కొనుగోలు చేయాలనీ రేవంత్ రెడ్డి ని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ని డిమాండ్ చేస్తున్నమన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులను కూడదీసి బీ ఆర్ ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వం పై పోరాడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సొయాపంట కుడా చేతికోస్తుందని, ప్రభుత్వం ఇప్పటినుండే పంట కొనుగోలు చేయడానికి ప్రణాళిక లు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం  జిల్లా కలెక్టర్ లకు, వ్యవసాయ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలన్నారు. మొక్కజొన్న పంట కొనుగోలు కు ఏర్పడిన పరిస్థితులు సొయా పంట కు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు.