Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 3:29 pm Posted by : ramakrishna

నవీపేట్ లో రైతు సదస్సు

నవీపేట్, బతుకమ్మ : నవీపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నవీపేట్ కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు  ఎరువుల వాడకం గురించి అవగాహన కల్పించారు. ఎరువులను ఎంత తక్కువ మోతాదులో వాడితే భూసారం అంత బాగుంటుంది అని తెలుపుతూ రాబోయే రోజులలో యూరియాని తక్కువ మోతాదులో వాడుతూ అధిక దిగుబడులను తేవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్. సి. ఎఫ్. లిమిటెడ్ ఏరియా  కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఏవో నవీన్ కుమార్, చైర్మన్ ఆర్ పృథ్వీరాజ్, సీఓ అనీష్ రాజ్, కంపెనీ సిబ్బంది గడీల చంద్రశేఖర్,  గ్రామ రైతులు పాల్గొన్నారు.