మహబూబాబాద్ లో రైతు సదస్సు
నిజామాబాద్, బతుకమ్మ: ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు మహబూబాబాద్ లో కొనసాగుతున్న రైతు సదస్సును విజయవంతం చేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కోరారు. సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని, జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.