Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 2:16 pm Posted by : ramakrishna

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన

 

మాక్లూర్, బతుకమ్మ :

 

అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా అడవి మామిడిపల్లి గ్రామంలో రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం అడవి మామిడిపల్లిలో పంటలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. రైతుల అరెస్టును ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా  ఖండించారు. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.