Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 8:20 pm Posted by : ramakrishna

గడ్డిమందుతో రైతుల ఆందోళన

 

. . . తమకు న్యాయం చేశాకే కళాశాలను ఏర్పాటు  చేయాలని కబ్జా రైతుల నిరసన

 

. . . రైతులకు న్యాయం చేస్తామని అధికారుల హామీ

 

బిక్కనూర్, బతుకమ్మ :

 

తమకు న్యాయం చేసిన తర్వాతనే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఐటిఐ కాలేజిని ఏర్పాటు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం గుర్జకుంట శివారులో కబ్జాలో ఉన్న రైతులు తమకు న్యాయం చేయాలని తర్వాతనే కాలేజి ఏర్పాటు చేయాలని కోరుతూ గడ్డిమందుతో హల్ చల్ చేశారు. శుక్రవారం గుర్జకుంట భూమిలో సాగు చేస్తున్న పుట్ట భూపాల్, పుట్ట చిన్న నరసింహులు, పుట్ట రాములు, పుట్ట దుర్గయ్య, పుట్ట నరసింహులు, పుట్ట లక్ష్మీనరసింలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ కళాశాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం కేటాయించిన భూమిలో రెవెన్యూ అధికారులు మార్కు చేయడానికి రాగా ఈ బాధిత రైతులు వారిని అడ్డుకున్నారు. తమకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించిందని ఈ భూమిలో కళాశాల ఏర్పాటు చేస్తే తమ బతుకులు ఎలా అని, పక్కనే ఉన్న వేరే ప్రభుత్వ భూమిలో ఈ కళాశాలను ఏర్పాటు చేయాలని అధికారులతో వారు వాదించారు.

Farmers' concern over herbicide

లక్షలు ఖర్చు చేసి ఈ భూమిని బాగు చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసిన తర్వాతనే ఈ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా అధికారులు స్పందించి బాధ్యత రైతులకు అన్యాయం జరగదని న్యాయం చేస్తామని ఈ కళాశాల ఏర్పాట్లు అడ్డుకోవద్దని విన్నవించారు. ఈ సర్వే నంబర్లు మిగులు భూమి ఉందని  సర్వే చేయించిన తర్వాత ఈ కళాశాలకు ఫోను మిగులు భూమిని బాధితులకు కేటాయించడం జరుగుతుందని లేనియెడల మరోచోట భూమిని కేటాయించి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటన సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు జరగకుండా భిక్కనూరు ఎస్సై అనిల్ నేతృత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు  నిర్వహించారు.

Farmers' concern over herbicide