నిజామాబాద్ లో ఉత్సాహంగా రైతు సంబరం

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఉత్సాహభరిత  వాతావరణంలో  రైతు విజయోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వానాకాలం -- 2025 సీజన్ కు సంబంధించి ముందస్తు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగా మంగళవారం రైతు సంబరాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్దకు అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఉత్సాహంగా ఈ సంబరాలలో పాల్గొన్నారు. రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడం...