Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2024, 2:16 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ తోనే రైతులకు మేలు

రుద్రూర్, బతుకమ్మ : కాంగ్రెస్ తోనే రైతులకు మేలు జరుగుతుందని, రైతులను ఆదుకున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, మాజీ జడ్పీటీసీ నారోజీ గంగారాం అన్నారు. సన్నధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇవ్వడాన్ని హర్షిస్తూ రైతులు, కాంగ్రెస్ నాయకులు ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ దిశ మెంబర్ గా నియమితులైన నడిపింటి నగేశ్ ను సన్మానించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, నాయకులు షేక్ నిస్సార్, ఇందూర్ కార్తీక్ స్వామి, కర్క అశోక్, పత్తి రాముస్వామి, అడప సాయిలు, పార్వతి ప్రవీణ్ స్వామి, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Farmers benefit only with Congress