Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 5:00 pm Posted by : ramakrishna

రైతులు బీ అలార్ట్

బతుకమ్మ, మాక్లూర్ : తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ధాన్యం  తడిచే అవకాశాలు ఉన్నాయి. కావున వర్షపాతం సూచన ఉన్నందువల్ల ధాన్యం, సోయాబీన్,మక్కలను టార్పలిన్స్ తో కప్పుకోవాలని ఆలాగే తుపాన్ ప్రభావం తగ్గే వరకు వరికోతలు వాయిదా వేసుకోవాలని మాక్లుర్ మండల వ్యవసాయ అధికారి  పద్మ కోరారు.ముఖ్యంగా మాక్లుర్ మండలంలోని చిక్లి,గుంజిలి, కొత్తపల్లి,వల్లాబాపూర్,బొంకన్పల్లి తదితర గ్రామాల్లో వారి కోతలు ఊపందుకున్న నేపథ్యంలో తమ ధాన్యం టార్పలిన్స్ కప్పుకోవాలని ఎఈఓ నరేష్ ధాన్యం కుప్పల వద్ద పర్యవేక్షించి రైతులకు సూచనలు తెలిపారు.