డిఎస్ఆర్ (డ్రమ్ సీడర్) ఉపయోగాలపై రైతులకు అవగాహన

  రుద్రూర్, బతుకమ్మ :   మండల కేంద్రంలోని రుద్రూర్ గ్రామంలో డా. రెడ్డిస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫీల్డ్ ఎక్స్‌ పోజర్ రైతుల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 140 మందికి పైగా రైతులు హాజరయ్యారు. ఈ సందర్బంగా డా.రెడ్డిస్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ అరుణ్ మాట్లాడుతూ డిఎస్ఆర్ (డ్రమ్ సీడర్) ఉపయోగాలు, ప్రయోజనాల గురించి సంక్షిప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, గ్రామ రైతులు, బోధన్ క్లస్టర్ రైతులు పాల్గొన్నారు.