నూతన సాగు విధానాలపై రైతులకు అవగాహన
మాక్లూర్, బతుకమ్మ : రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు నూతన సాగు విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని మాక్లూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాస్త్రవేత్త సాయి చరణ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ముఖ్యఅతిథిగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా కమిటీ సభ్యుడు కోటపాటి నరసింహంనాయుడు హాజరయ్యారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పెద్ద ఎత్తున చేపట్టిన" రైతుల వద్దకే శాస్త్రవేత్తలను పంపి వ్యవసాయంలో తీసుకోవాల్సిన మెలకువలు, నూతన సాగు పద్ధతులు, నూతన...