రైతులకు ఆధునిక వరి పద్ధతులపై అవగాహన
బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలం, పెంటకుర్దు గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ అధికారులు రైతులకు వరి పంట సాగులో నూతన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నేరుగా వరి విత్తడం ద్వారా డైరెక్ట్ సీడెడ్ రైస్, డ్రం సీడర్, తడి-పొడి పద్ధతుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గడం, కూలీల ఖర్చు మరియు సమయం ఆదా కావడం, నీటి వినియోగం నియంత్రణలో ఉండడం వంటి లాభాలు ఉంటాయని తెలిపారు. అలాగే...