విద్యుత్ సమస్యలపై రైతులకు అవగాహన

రుద్రూర్, బతుకమ్మ: విద్యుత్ శాఖ వారి రైతు పొలం బాట కార్యక్రమంలో భాగంగా  రుద్రూర్ సెక్షన్ లోని రాయకూర్ గ్రామ రైతులతో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కే.నగేష్ కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, (రుద్రూర్) మాట్లాడుతూ.. రైతులు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను, విద్యుత్తు పొదుపు, కెపాసిటర్లు అమర్చడం వలన కలిగే లాభాలను వివరించారు. అలాగే కాలి పోయిన ట్రాన్స్ ఫార్మర్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు, లూస్ లైన్లు, వంగిన స్తంభాలు, విరిగిన స్తంభాలు, చెట్టుకొమ్మలు తగలడం వంటి...