ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన
ఆర్మూర్, బతుకమ్మ: ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆర్మూర్ పట్టణంలో ఆందోళనకు దిగారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సేకరణ ఆలస్యమవుతోందని, ఫలితంగా వర్షానికి ధాన్యం తడిసిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. నిజాంసాగర్ కెనాల్ బ్రిడ్జిపై బైఠాయించారు.