Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 November 2024, 8:08 pm Posted by : ramakrishna

రైతు పండుగకు రైతులు కరువు

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : తెలంగాణ ప్రభుత్వం రైతన్నల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన రైతు పండుగ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికలలో రైతులకు ప్రదర్శన ఏర్పాటు చేశారు కాగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు పండుగను వీక్షించేందుకు వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు రైతులు కరువయ్యారు. రైతు వేదికలో రైతు పండుగ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కేవలం మంది రైతులు మాత్రమే హాజరై రైతు పండుగ కార్యక్రమాన్ని వీక్షించారు. మండల వ్యవసాయ అధికారులు వివిధ గ్రామాల రైతులకు సమాచారం ఇవ్వకపోవడంతోనే రైతులు రైతు పండుగ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని పలువురు రైతులు ఆరోపించారు రైతు పండుగ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించేందుకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం అధిక సంఖ్యలో హాజరు కాలేకపోవడం రైతులకు రైతుబంధు డబ్బులు వేయకపోవడమే కారణమని, దీనికి తోడు మండల వ్యవసాయ అధికారులు రైతులకు సరైన సమాచారం ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటినుండి అయినా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వీడియో కాన్ఫరెన్స్ లు, సమావేశాలు ఏర్పాటు చేస్తే రైతులకు సరియైన సమాచారం అందజేయాలని రైతుల కోరుతున్నారు.

Farmers are thirsty for the Farmer's Festival