Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2024, 6:13 pm Posted by : ramakrishna

కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు లేక రైతుల ఇబ్బందులు

– ప్రభుత్వం వెంటనే కాల్వల నిర్మాణం చేపట్టాలి 

– గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతే రాజుగా చూసేది

– కాంగ్రెస్ ప్రభుత్వం రైతును ఎండ పెట్టే విధంగా వ్యవహరిస్తుంది : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

-వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి

బతుకమ్మ దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక,మిరుదొడ్డి,అక్బర్‌పేట-భూంపల్లి మండలంలోని గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామన్నారు.. గత పది రోజుల నుంచి వర్షాలు పడుతున్న కారణంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని  తెలిపారు. కొనుగోలు కేంద్రాలకి మాత్రం హడావిడి చేస్తుంది ప్రభుత్వం. కొనుగోలు చేసే ముందు రైతులు ఇబ్బందులు తెలుసుకోవాలి అని సూచించారు. ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలి, ప్రభుత్వం నిర్మించిన గోదాంలో ఖాళీ 20 శాతం ఉన్న కూడా సరిపోదని అన్నారు. ఈరోజు ఏ రైస్ మిల్ కూడా అలా పెట్టించలేదని, ధాన్యం మొత్తం వర్షపు నీటిలో తడిచి కళ్ళ ముందు మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 90 నుంచి 90 శాతం ధాన్యం ఇంకా కొయ్యలేదు కానీ ఐదు రోజులు ముందు నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం చేతులు దులుపుకొని కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకుంటే సరిపోయిందనుకుంటున్నారని అన్నారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఏ గ్రామంలో ఏమవుతున్నది కనుక్కోలేదని, ధాన్యాన్ని ఎక్కడికి పంపించాలి ఏ గోదాంలో పెట్టించాలి కాని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ద్వారా కాలువలను దుబ్బాకకు పూర్తిగా నిర్మాణం చేసి రైతులకు కాలువల ద్వారా ప్రతి గ్రామానికి నీరు అందించే విధంగా ప్రభుత్వం పనులు చేపట్టాలని దుబ్బాక ఎప్పుడైనా వెనుకబడిన ప్రాంతంగానే ఉంటుంది అని ప్రజాపక్షంగా ప్రభుత్వంతో కొట్లాడి దుబ్బాక అభివృద్ధి చేస్తానని తెలియజేశారు . కానీ ఈసారి వరి పంట రైతులు చాలా బాగా పండించారని దుబ్బాకలో ఎన్నడూ లేని విధంగా మంచి వర్షాలు పడ్డాయని,పంటలు కూడా బాగా పండుతున్నాయని తెలిపారు. . గతంలో చేసినట్టు ఇప్పుడు కూడా చెయ్యమంటున్నాం కొత్తగా ఏం చెయ్యమనడం లేదు కొనుగోలు కేంద్రా ప్రారంభోత్సవం పది రోజులు ముందు ఇంచార్జ్ మంత్రులు, కలెక్టర్లు, సివిల్ ఎంప్లాయిస్ వీళ్ళందరూ ప్రారంభోత్సవం చేశారు కానీ ఎక్కడెక్కడికి పంపించాలి. ఎన్ని లారీలు పంపాలి, ఎన్ని గన్ని బ్యాగ్స్ పంపాలి ఏ సెంటర్లో ఎంత రిక్రూమెంట్ వస్తది రైతులు ఎంత నాటు వేశారు. అనేది కూడా లెక్కలేదు ప్రభుత్వం దగ్గర లేకపోవడం చాలా దారుణం అని ఇప్పటి వరకు ఏ సెంటర్ కి కూడా గన్ని బ్యాగ్స్ రాలేదని తెలిపారు. ఏ రైస్ మిల్లుకు అలెర్ట్ రాలేదు. ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలి అని రైతులు ఆందోళన పడుతున్నారని తెలిపారు. ప్రారంభోత్సవాలు మాత్రం చేశారు గతంలో ఈ పరిస్థితి ఉందా రైతులు కూడా గమనిస్తున్నారు. రైతులు చాలా భయభ్రాంతులవుతున్నారు ఇంత పంట పండిస్తున్నారు ఎక్కడ పెట్టుకోవాలి ఏ ఊర్లోను కల్లాలు కి జాగా లేదు. అందరూ కూడా మండల కేంద్రాలకు నియోజకవర్గ కేంద్రాలకు గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం కట్టించిన గోదాం ఉన్నాయి. అవి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి కానీ షిఫ్ట్ అయ్యి వెళ్ళాలి లారీల్లో బస్తాలు పోవాలి సంచులు లేవు అవి ఏడ పోసుకుందాం అన్నా వర్షం పడ్డది అవి మొత్తం నాని పోతున్నాయి కనీసం దాన్యం తీసుకుని పక్కన పెట్టుకుందామన్న సంచులు లేవు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మీకు సంబంధించిన అధికారులను కోఆర్డినేట్ చేసి త్వరలోనే ఈ ధాన్యాన్ని ఇక్కడి నుంచి కొనుగోలు చేసి ఎక్కడెక్కడ ఏ రైస్ మిల్క్ పంపిస్తారు ఎవరికి అలెర్ట్ చేశారో కచ్చితంగా ఐదారు రోజులలో రోజుల్లో చెయ్యకపోతే రైతులకు ఇబ్బందికరంగా మారుతుందని తెలియజేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Farmers are in trouble due to mine bags in purchase centers