Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 February 2025, 8:05 pm Posted by : ramakrishna

సిండికేట్ అయి రైతులను మోసం చేస్తున్నారు

బతుకమ్మ, వేల్పూర్ : 

 

నిజామాబాద్ మార్కెట్ యార్డులో వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నారని రైతులు టక్కరి గంగాధర్,గుడాల మోహన్ లు  అన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామానికి చెందిన రైతులు టక్కరి గంగాధర్,గుడాల మోహన్ లు  పదివేల నుంచి 12000 కూడా ఉంచడం లేదని,  పసుపు బోర్డు అని చెప్పిన వాళ్ళు పసుపు బోర్డు ఏమి పని చేస్తుందన్నారు. ఎన్నికల ముందు పసుపు బోర్డు అనౌన్స్ చేయడం, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం ఇలా సంవత్సరానికి ఒక పేపర్ విడుదల చేస్తూ పోతే ఏ రోజు రైతుకు మద్దతు ధర లభిస్తుందని ప్రశ్నించారు. పసుపు బోర్డు అనగానే పాలాభిషేకాలు చేయించుకున్న వారు ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎర్ర జొన్న వ్యాపారులు సిండికేట్ గా మారి కోతలు మొదలైన రోజు ధర 4500 ఉండగా పది రోజుల వ్యవధిలో 3500 రూపాయలు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ పసుపు రైతులని, ఎర్ర జొన్న రైతులను నిండా ముంచుతున్న  దళారులని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ రాజేందర్, శీలం రజనీకాంత్ ,కోలే మోహన్ గడ్డం సత్యం, చిన్న బాలయ్య,రైతులు పాల్గొన్నారు.