కరెంట్ కోతలపై అన్నదాతల అగ్రహం
. . . సబ్ స్టేషన్ ఆపరేటర్ నిర్భంధం కామారెడ్డి, బతుకమ్మ : వరిసీజన్ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఎడతెరిపి లేకుండా జరుగుతున్న పవర్ కట్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా నిరంతరంగా విద్యుత్ కోతలు కొనసాగుతుండటంతో బోరు మోటార్లు నడవక, పొలాల్లో వేసిన నారు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను నిర్బంధించి నిరసన తెలిపారు....