గ్రోమోర్ ఎరువుల దుకాణం సిబ్బందిపై రైతుల ఆగ్రహం
బాన్సువాడ, బతుకమ్మ : బీర్కూర్ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం సిబ్బంది వైఖరిపై రైతులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పలు గ్రామాల రైతులు మల్లాపూర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి యూరియా సరఫరాలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, బీర్కూర్ లోని గ్రోమోర్ సిబ్బంది మందులు, ఎరువుల సరఫరాలో మరింత జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని, దీంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని వాపోయారు. ఎలాంటి...