Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2024, 7:10 pm Posted by : ramakrishna

తహసిల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

బతుకమ్మ :బిచ్కుంద : తాసిల్దార్ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే కొడప్గల్ మండలం వడ్లెం గ్రామానికి చెందిన రైతు అంజయ్య వడ్లం గ్రామ శివారులో 134/3 సర్వే నంబర్ లో గల 3-14 గుంటల భూమి మా అన్నదమ్ముల పేరిట ఉంది.

తిరిగి భూమిని తన పేరు మీదకు మార్చాలని ఆర్ఐ పండరీకి అప్లికేషన్ చేసుకోగా ఇట్టి భూమి పార్ట్ బి లో ఉన్నందున 20వేల రూపాయలు ఇస్తే పార్ట్ బి నుంచి తొలగించి పట్టా చేసి పాస్ బుక్కు ఇస్తానని చెప్పి గత ఆరు నెలల నుంచి సదరు రైతును వెంట తిప్పించుకుంటు కాలం వెళ్లదీస్తున్నాడు. విసుగు చెందిన రైతు జులై 31న ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. పనులు వదులుకోలేక కార్యాలయాలు చుట్టూ తిరగలేక విరక్తి చెందిన రైతు పెద్దకొడప్గల్ తాసిల్దార్ కార్యాలయంలోనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు రైతును మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇట్టి విషయమై పెద్దకొడప్గల్ తాసిల్దారును చరావాని నందు బతుకమ్మ వివరణ అడగగా పార్ట్ బి లో ఉన్న ప్రభుత్వ భూమిని పట్టా చేసి ఇవ్వడం కుదరదు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లయితే చేసి ఇస్తామని పలుమార్లు రైతుకు చెప్పడం జరిగింది. అని అన్నారు.

Farmer suicide attempt in Tehsildar office