Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 January 2025, 8:12 pm Posted by : ramakrishna

రెండో రోజుకు చెరిన రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష

మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రీయల్ జోన్ లోని వ్యవసాయ భూములను తోలగించాలని రైతు నిరసన

 కామారెడ్డి, బతుకమ్మ :

 కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రీయల్ జోన్ లోనుంచి వ్యవసాయ భూములను తోలిగించాలని రైతు శ్రీకాంత్ రెడ్డి చెపట్టిన అమరణ నిరహర దిక్ష రెండో రోజుకు చెరింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు రైతు శ్రీకాంత్ రెడ్డి కి రైతులు ఆమరణ నిరాహార దీక్షకు  పూలమాలవేసి దీక్షకు రైతులు మద్దతు తెలిపారు. ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయ భూముల ను కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో చూపిన ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్ ఎత్తివేస్తామని చెప్పారని మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పారు కానీ అది అధికారికంగా జీవో కాపీ ప్రకటించలేదని అన్నారు. అప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాగానే అధికారికంగా ప్రకటించి రద్దుచేసి జీవో కాపీని రైతులకు  ఇస్తామని చెప్పారని సంవత్సరం అవుతున్న  ఇంతవరకు అమలు చేయడం లేదని అన్నారు.  కామారెడ్డిలోని మున్సిపల్ పరిధిలోని 8 విలీన గ్రామాలలోని 1195 ఎకరాల భూమి  ఇండస్ట్రీయల్ జోన్ లో చూపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని రైతు శ్రీకాంత్ రెడ్డి  అన్నారు.శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు  కామారెడ్డి ఎమ్మార్పిఎస్ నాయకులు మద్ధత్తు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేస్తున్నట్లు అధికారికంగా జీవో కాపీ జారీ చేయాలని లేకపోతే మా ఎమ్మార్పీఎస్  పక్షాన రైతు దిక్షకు మద్ధత్తుగా అందోళన చెస్తామని ప్రకటించారు.

Farmer Srikanth Reddy went on hunger strike for the second day