వడ దెబ్బ తగిలి రైతు మృతి
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలం ఆడివిలింగాల గ్రామానికి చెందిన రైతు లింగాల రాములు (59) వడదెబ్బకు గురై మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక ఎస్‌ఐ మహేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం, రాములు ఉదయం తన పొలంలో పనులు ముగించుకుని సాయంత్రం సుమారు 4 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అనంతరం మరో పొలానికి నీళ్లు పారబెట్టేందుకు వెళ్లి, రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తదుపరి...