Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2024, 6:28 pm Posted by : ramakrishna

విద్యుత్ షాక్ తో రైతు మృతి

బతుకమ్మ  నాగిరెడ్డిపేట్ : మండలంలోని జలాల్ పూర్ గ్రామానికి చెందిన చిటుకుల పోచయ్య (38) అనే రైతు శుక్రవారం ఉదయం జలాల్ పూర్ గ్రామ శివారులోని తమ పంట పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద, తన అల్లుడు రమేష్ తో కలిసి విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. మృతునికి భార్య పారిజాతం, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లు జరగగా చిన్న కూతురు అఖిల ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. మృతుని భార్య చిటుకుల పారిజాతం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.