Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2024, 5:04 pm Posted by : ramakrishna

కరేంటు షాక్  తో రైతు దుర్మరణం

బతుకమ్మ,  కామారెడ్డి:                                                                                                                             

కామారెడ్డి జిల్లాలో కరేంట్ షాక్ తో రైతు దుర్మరణం చెందారు. ఈ సంఘటన శనివారం మద్యహ్నం జరిగింది. రాజం పేట్ మండలం ఎల్లారెడ్డి పల్లికి చెందిన ముక్కిరి ఎల్లయ్య (41)  శనివారం ఉదయం గుండారం గ్రామ శివారులో తన వ్యవసాయ పోలానికి వేళ్లాడు.తన పోలం వద్ధ ఉన్న విద్యుత్ మోటార్ వద్ధ గడ్డి పెరుగడంతో కోడవలితో కోస్తుండగా ప్రమాదవశాత్తు గడ్డిలోనే ఉన్న విద్యుత్ తీగలను కోశాడు. దానితో విధ్యుత్ ప్రసారం జరిగి ఎల్లయ్యకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బార్య మంజుల పిర్యాదు మేరకు రాజం పేట్ పోలిస్ లు కేసు నమోదు చేసి  పోస్టు మార్టం నిమిత్తం డేడ్ బాడిని ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్ధరు పిల్లలు ఉన్నారు.