Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2025, 7:45 pm Posted by : ramakrishna

ప్రమాదవశాత్తు బురదలో పడి రైతు మృతి

రుద్రూర్, బతుకమ్మ:  రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన సాయినాథ్(38) అనే రైతు తమ వ్యవసాయ పొలంలో ప్రమాదవశత్తు కాలు జారీ పడి మృతి చెందాడు. రుద్రూర్ ఎస్సై సాయన్న  తెలిపిన వివరాల ప్రకారం..  రుద్రూర్ మండలంలోని చిక్కడ్ పల్లి గ్రామ శివారులో గల  తమ ఇంటి పొలం వద్దకు గురువారం పని నిమిత్తం వెళ్ళాడు. పక్క పొలం ఉన్న వ్యక్తి సాయినాథ్ పంట పొలం బురదలో పడి ఉన్నట్టు గమనించి ఇంటి వారికి సమాచారం ఇవ్వగా, కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని సాయినాథ్ ని 108 అంబులెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చూసిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య అర్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.