Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 March 2025, 8:53 pm Posted by : ramakrishna

దిగుబడి రాక రైతు ఆత్మహత్య

రాజంపేట, బతుకమ్మ :  వేసిన పంటకు దిగుబడి రాక మరోవైపు పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం పొందుర్తి గ్రామానికి చెందిన తిరుగుడు స్వామి (36) పొందుర్తి గ్రామ శివారులో తనకున్న రెండు ఎకరాల పంట పొలంలో దిగుబడి రాక నీరు లేక పంట ఎండిపోయింది. దీంతో మనస్థాపానికి గురై సోమవారం ఉదయం ఇంటి ముందు గల హాలులో లుంగీతో  ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని భార్య పోచవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మృతుడికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు.

Farmer commits suicide due to poor yield