Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2025, 6:23 pm Posted by : ramakrishna

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు

బతుకమ్మ, ఏర్గట్ల: దోంచంద గ్రామంలో వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ మాట్లాడుతూ ముక్యంగా ఆయిల్ పామ్ సాగు లాభాలు, రైతులకి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాల ను రైతులకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది,అలాగే పసుపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అధిక ఎరువులు వాడడం వల్ల జరిగే నష్టాలు, పాటించవలసిన మెళుకువలు సూచించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్, ఉద్యాన శాఖ అధికారి రుద్ర వినాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొర్రిపల్లి లింగారెడ్డి, సొసైటీ చైర్మన్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ విస్తరుణాధికారి సాయి సచిన్, ప్రియునిక్ కంపెనీ ప్రతినిధి ప్రేమ్ సింగ్,గ్రామా రైతులు పాల్గొన్నారు.