Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2025, 2:23 pm Posted by : ramakrishna

బ్యాంకు అధికారుల వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం

నల్గొండ, బతుకమ్మ : బ్యాంకు అధికారులు అప్పు చెల్లించాలని వేధించడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈఘటన నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం తేనేపల్లి తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన రైతు వడిత్య జవహర్ లాల్ ఎన్డీసీసీబీ గుర్రంపోడు శాఖలో అప్పుతీసుకున్నాడు. అప్పు తీర్చకపోతే వ్యవసాయ భూమిలో జెండాలు పాతి భూమిని వేలం వేస్తామని నోటీసులు ఇస్తూ బ్యాంకు సిబ్బంది బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురైన రైతు జవహర్ లాల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.