ఘనంగా ఉపాధ్యాయునికి వీడ్కోలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఎల్.మహేందర్ గౌడ్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానిన ఎల్లారెడ్డి వంగపల్లి నాగభూషణం ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇటీవల పదవి విరమణ చెందిన మండల విద్యాధికారి ఏ.వెంకటేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మహేందర్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు...