Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2024, 6:11 pm Posted by : ramakrishna

టీఎస్ యూటిఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ దుర్గప్రసాద్ కు వీడ్కోలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డీఈఓ దుర్గప్రసాద్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా టీఎస్ యూటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సత్యానంద్, ఓ.రమేష్ మాట్లాడారు. డీఈఓ దుర్గాప్రసాద్ విద్యావ్యవస్థకు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి వి.సాయన్న పాల్గొన్నారు.