బతుకమ్మ బోధన్ : వేసవికాలం సీజన్ ప్రారంభం కాకముందే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బోధన్ ఆర్టీసీ డిపో బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన ఫ్యాన్లు తిరగకపోవడంతో ఎండ తాపానికి ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇకనైనా డిపో మేనేజర్ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్లు తిరిగేలా కనీస వసతులు ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
