Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 10:02 pm Posted by : ramakrishna

దీర్ఘకాలిక వివాదాలతో కుటుంబాలు చిన్నాభిన్నం

  • జాతీయ లోక్ అదాలత్ లో 18,252 కేసుల పరిష్కారం
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కుటుంబాల మధ్య దీర్ఘకాలిక వివాదాలతో కుటుంబాల జీవినచిత్రం చిన్నాభిన్నం అవుతుందని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సేషన్స్ జడ్జి,జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో జాతీయ లోక్ అదాలత్ ను జ్యోతిష్య ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ్ లోక్ అదాలత్ లో 18,252కేసులు పరిష్కారం అయినట్లు తెలిపారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో సివిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులు పరిష్కారం అయినట్లు ఆమె తెలిపారు. సత్వర న్యాయం, ఉచిత న్యాయసేవలు న్యాయార్ధులకు అందించడమే ధ్యేయంగా  న్యాయసేవాధికార సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది ఆమె తెలిపారు.దాదాపు 13 వేల 680 కేసులను పరిష్కరించడానికి అనువుగా గుర్తించామని అన్నారు.56 మోటారు వాహన రోడ్డు ప్రమాద నష్ట పరిహార దావాలు బాధితులు, బీమా కంపెనీల రాజీ ప్రతిప్రాధికన అవార్డులను జారీ చేయడానికి వీలు ఉన్నదని,ఇందులో 3 కోట్ల 10 లక్షల,65 వేల రూపాయలు బాధితుల బ్యాంక్ ఖాతాలలో జమా చేయడం జరుగుతుందని వివరించారు.న్యాయసేవలు ప్రజలకు అందించడంలో జిల్లా అధికార యంత్రాంగం సహకారాన్ని మరువలేమని ఆమె కొనియాడారు. ప్రభుత్వ రంగసంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సంబంధించిన14 బ్రాంచిలలోని దీర్ఘకాలిక రుణ బకాయిలను రాజీపద్దతిన పరిష్కరించి,ఋణగ్రహీతల నుండి 33 లక్షల 33 వేల రూపాయలకుగాను అవార్డులను అందించడం జరిగిందని తెలిపారు.జిల్లాజడ్జిగా,సంస్థ చైర్ పర్సన్ గా  మూడున్నరేళ్ల విధులు నిర్వస్తున్న కాలంలో జిల్లా నుండి బదిలీకి వృత్తిరీత్యా అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలతో కలగలిసిపోయిన అనుబంధం తీపి గుర్తుగా మిగిలిపోనుందని ఆమె గుర్తు చేసుకున్నారు.జిల్లాలో తనకు ఇదే చివరి జాతీయ లోక్ అదాలత్ అని పేర్కొన్నారు. చట్టపరిదిలో చట్టాల ప్రయోజనాలను ప్రజలకు ఎరుకచేసే భాగ్యాన్ని న్యాయసేవ సంస్థ కల్పించిందని జిల్లాజడ్జి సునీత తెలిపారు. అదనపు జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ లోక్ అదాలత్ లో రాజీపడడమనే పద్దతి పూర్వకాలంల నుండి ఉన్నదని అన్నారు.గుర్తు తెలియని మోటారు వాహన ప్రమాదంలో చనిపోయిన వారికి రెండు లక్షలు, తీవ్రగాయాలు అయిన వారికి యాభై వేల పరిహారం అందించలనే ప్రభుత్వ రూల్స్ ఉన్నాయని తెలిపారు. సమాజానికి మేలు చేసే అత్యుత్తమమైన మార్గం లోక్ అదాలత్ అని నిజామాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి అన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ గ్రహీతల నుండి రుణ బకాయిలను తిరిగి రాబట్టుకోవడం వలన రుణ గ్రహీతలకు ,బ్యాంకు కు లాభమే చేకూరిందని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేశ్వర్ ఆనందం వెలిబుచ్చారు. న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి సంస్థ లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్,జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ్,గోపికృష్ణ,చైతన్య, హరి కుమార్, శ్రీనివాసరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్,బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,న్యాయవాదులు ఆశ నారాయణ, మానిక్ రాజు,దాసరి పుష్యమిత్ర,సంతోష్ నిర్మల్కర్ ,రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.